పండగవేళ మరింత ప్రియం
దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.750లు పెరిగింది. వెండి కూడా కిలోపై రూ.1,550 పెరిగింది
అనుకున్నట్లే జరిగింది. దీపావళికి బంగారం ధర పెరుగుతుందని అంచనాల నిజమయ్యాయి. థనతెరాస్ కు బంగారం పసిడిప్రియులకు షాక్ ఇచ్చింది. మార్కెట్ నిపుణులు ముందు నుంచి చెబుతున్నట్లే జరిగింది. బంగారం అంటేనే భారతీయ మహిళలు మహా ఇష్టపడిపోతారు. తమ ఒంటి మీద పండగ రోజు కొత్త బంగారు నగలను చూసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. బంగారానికి వన్నె తగ్గట్లుగానే ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి విలువ వంటి కారణాలు బంగారం ధరల్లో మార్పులకు కారణమవుతాయని చెబుతూ వస్తున్నారు. పండగ రోజున బంగారం దుకాణాలన్నీ కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. ధరలు పెరిగినా కొనుగోలు చేసేందుకు ఎవరూ వెనకాడటం లేదు.
వెండి కూడా...
దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.750లు పెరిగింది. వెండి కూడా కిలోపై రూ.1,550 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,280 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,000 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 63,200 రూపాయలుగా ఉంది.