భారంగా మారిన బంగారం ధరలు

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.

Update: 2022-11-28 02:43 GMT

బంగారం ధరలు సామాన్యులకు అందకుండా పోతున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలకు బంగారం కొనుగోలు చేయాలంటే అందని ద్రాక్షలా మిగిలిపోతుంది. పెరుగుతున్న బంగారం ధరలతో ఆ వర్గాలకు బంగారం దూరం అయిందనే చెప్పాలి. ఎగువ మధ్యతరగతి, ధనిక వర్గాల వస్తువుగానే బంగారం మిగిలిపోయే అవకాశముంది. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. బంగారం ఇప్పటికే భారంగా మారిపోయిన పరిస్థితుల నుంచి ఇక తగ్గుముఖం పట్టే అవకాశాలు మాత్రం లేవన్నది మార్కెట్ నిపుణుల అంచనా.

స్థిరంగా వెండి....
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,980 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,560 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 67,500 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతుంది.


Tags:    

Similar News