చెప్పలా... మళ్లీ పెరిగింది
బంగారం ధరలు దేశంలో భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం పైరూ.250లు పెరిగింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తుంది.
బంగారం అంటే అంతే మరి. వారంలో రెండు రోజులు తగ్గితే ఐదురోజులు పెరగడం మామూలుగా మారింది. అందుకే బంగారం ధరలు అందకుండా పోతున్నాయి. బంగారాన్ని పెట్టుబడిగా చూసి గతంలో కొనుగోలు చేసే వారు కూడా పెరుగుతున్న ధరలను చూసి వెనక్కు తగ్గుతున్నారు. పెరగడం విరగడం కోసమే అన్న సామెత గుర్తొచ్చి బంగారం కొనుగోలుపై కొంత ఆసక్తి తగ్గిందని వ్యాపారులు కూడా చెబుతున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి విలువ వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. మేలిమి బంగారం సంగతి అటుంచి.. 22 క్యారెట్ల బంగారం యాభైవేలకు చేరుకునే పరిస్థితి ఉంది. ఇది ఇలా కొనసాగితే బంగారం కొనుగోలు చేయాలంటే ఎవరికైనా కష్టంగా మారుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.