షాకింగ్.. పెరిగిన బంగారం ధరలు

దేశంలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. పది గ్రాముల బంగారం పై 200 రూపాయలు పెరిగింది

Update: 2022-07-30 02:27 GMT

బంగారం ధరల పెరుగుదల, హెచ్చుదల కోసం ఎవరూ ఎదురు చూడటం లేదు. ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు కొనుగోలు చేయడం ఒక అలవాటుగా మారింది. భారతీయుల ఈ అలవాటు బంగారం డిమాండ్ ను పెంచుతుంది. బంగారం ధర పెరిగినా, తగ్గినా పెద్దగా పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు శ్రావణమాసం కూడా ప్రారంభం కావడం, పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో బంగారం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న నిల్వల బంగారం ధరలపై ప్రభావం చూపనున్నాయి. బంగారం భారతీయ సంస్కృతిలో భాగంగా మారిపోవడంతో బంగారానికి రోజురోజుకూ డిమాండ్ పెరుగుతూ పోతుంది. బంగారాన్ని తమ ఇంట్లో ఒక వస్తువుగా భావించడం వల్లనే దానికి గిరికీ రోజురోజుకూ పెరుగుతుంది.

ధరలు ఇలా...
దేశంలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. పది గ్రాముల బంగారం పై 200 రూపాయలు పెరిగింది. వెండి ధర కూడా పెరిగింది. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,200 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,200 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 60,500 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News