బ్యాడ్‌లక్.. బంగారం ఎంత పెరిగిందంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.550లు పెరిగింది. వెండి కూడా పెరిగింది.
గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతుంటే అందరూ ఆనంద పడ్డారు. రెండు రోజుల పాటు తగ్గిన ధర కంటే అధికంగా ఈరోజు బంగారం ధరలు పెరగడంతో మళ్లీ బంగారం భారంగా మారింది. బంగారం ఎప్పుడూ అంతే. తగ్గినప్పుడు స్వల్పంగా, పెరిగినప్పుడు అధికంగా పెరగడం సర్వసాధారణం అయిపోయింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. భారతీయ సంస్కృతిలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం కొనుగోలు తప్పనిసరి కావడంతో అధిక మంది కొనుగోలు చేస్తుంటారు. పేద, ధనిక తేడా లేకుండా దక్షిణ భారత దేశంలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. మిగిలిన ప్రాంతాల్లో మాదిరి గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేసే అలవాటు ఇక్కడ లేకపోవడంతో ఆభరణాల వైప ఎక్కువగా మొగ్గు చూపుతారు. అందుకే బంగారు ఆభరణాలు ఎప్పటికకప్పుడు కొత్త కొత్త డిజైన్లతో కొనుగోలుదారులను ఆకట్టుకునే విధంగా జ్యుయలరీ దుకాణాల యాజమాన్యాలు ప్రయత్నిస్తుంటాయి.