ఆషాఢం .. బంగారం ధరలు

దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయ. వినియోగదారులకు ఒకరకంగా ఇది గుడ్ న్యూస్

Update: 2022-07-09 01:51 GMT

ఆషాఢ మాసం కావడంతో కొంత బంగారం కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. ఆషాఢమాసంలో శుభకార్యాలకు దూరంగా ఉంటారు. అందువల్లనే బంగారం కొనుగోళ్లు తగ్గుతాయని చెబుతుంటారు. వచ్చే నెల నుంచి మళ్లీ పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండట, శుభముహూర్తాలు ఉంటాయి కాబట్టి బంగారం కొనుగోళ్లు ఊపందుకుంటాయని వ్యాపారులు చెబుతున్నారు. బంగారం ధరల ప్రభావం అనేక వాటిపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు బంగారం ధరలపై ప్రభావం చూపుతుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు.

ధరలు స్థిరంగా...
తాజాగా దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయ. వినియోగదారులకు ఒకరకంగా ఇది గుడ్ న్యూస్. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,110 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,850 రూపాయలుగా ఉంది. వెండి కిలో 62,500 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News