బ్యాడ్‌లక్.. సండే ధర అదిరింది

దేశంలో బంగారం ధరలు ఈరోజు పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి

Update: 2023-04-30 02:26 GMT

బంగారం ధరలు ఎప్పుడూ అంతే. ఒకరోజు తగ్గితే ఆరు రోజులు పెరుగుతాయి. ప్రజలు కూడా దీనికి అలవాటు పడిపోయారు. అందుకే బంగారం ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయాలంటారు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం, కేంద్ర ప్రభుత్వం బంగారంపై కస్టమ్స్‌పై డ్యూటీ పెంచడం, బంగారం దిగుమతులను కేంద్ర ప్రభుత్వం తగ్గించడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. పేద, మధ్య తరగతి ప్రజలకు బంగారం కొనుగోలు చేయాలంటే గగనంగా మారిపోయింది. పెళ్లిళ్ల సీజన్‌లో తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేయాల్సి రావడంతో ఇక తప్పడం లేదు. అందుకే తగ్గినప్పుడే బంగారం కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్‌ నిపుణులు చెబుతుంటారు.

స్థిరంగా వెండి...
తాజాగా దేశంలో బంగారం ధరలు ఈరోజు పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధరపై వంద రూపాయలు పెరిగిందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,850 రూపాయలుగా నమోదయి ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,930 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర 80,400 రూపాయలు పలుకుతుంది.


Tags:    

Similar News