బ్యాడ్ న్యూస్.. బంగారం ధర పెరిగింది

దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై వంద రూపాయలు పెరిగింది.

Update: 2022-07-21 02:27 GMT

బంగారం అంటేనే ఎవరికైనా మహా ప్రీతి. బంగారాన్ని విలువైన వస్తువుగా మాత్రమే కాకుండా భారత దేశంలో గౌరవం, హుందాతనానికి ప్రతీకగా భావించడం మొదలవ్వడంతోనే దానికి డిమాండ్ పెరిగింది. ప్రతి ఇంట్లో దానిని ఒక విలువైన వస్తువుగా చూస్తారు. అందుకే బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

ఈరోజు ధరలు....
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల పది గ్రాముల బంగారం ధర 50,620 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం దర 46,400 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి హైదరాబాద్ మార్కెట్ లో 61,000 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News