బంగారం భలే... భలే..!
దేశంలో బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.
బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతుంటాయి. తగ్గడం ఎంతైనా తక్కువే. ఆ సంగతి పసిడి ప్రియులందరికీ తెలుసు. అయినా కొనుగోళ్లు మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. జ్యుయలరీ షాపులో రద్దీ నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం, కేంద్ర బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీ పెంపుదల, బంగారం దిగుమతులను తగ్గించడం వంటి కారణాలతో బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పెరిగే అవకాశముంది. ఈ ఏడాది పది గ్రాముల బంగారం ధర డెబ్భయివేల రూపాయలకు పెరుగుతుందని చేస్తున్న అంచనాలు నిజమయ్యేటట్లే ఉన్నాయి.
స్థిరంగా వెండి....
తాజాగా దేశంలో బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు మాత్రమే పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,700 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,850 రూపాయలుగా నమోదయింది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర 82,500 రూపాయలుగా కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.