గోల్డ్ లవర్స్ కు గుడ్‌న్యూస్

దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.100లు తగ్గింది. వెండి కూడా బాగానే తగ్గింది.

Update: 2023-02-21 04:59 GMT

బంగారం ధరలు కొద్దిగా తగ్గినా ఎంత ఆనందమో. ఇప్పుడే కొనుగోలు చేయాలనిపిస్తుంది. కేంద్ర బ్యాంకుల్లో ఉన్న బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు పెరుగుదల, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ ల మధ్య ‍యుద్ధం కారణంగా బంగారం ధరలు పెరుగుతాయంటున్నారు మార్కెట్ నిపుణులు. బంగారం ఆపద సమయంలో ఆదుకుంటుంది. ఉన్న డబ్బులతో బంగారాన్ని కొనుగోలు చేస్తే అది కష్టకాలంలోనూ ఉపయోగపడుతుందన్న భావన మొన్న కరోనా సమయంలో ప్రతి ఒక్కరికీ అర్ధమయింది. కరోనా సమయంలో ఉద్యోగాలు లేక, జీతభత్యాలు రాక చివరకు బంగారమే దిక్కయింది. బ్యాంకుల్లో కుదువ పెట్టి మరీ డబ్బులు తెచ్చుకుని ఉపశమనం పొందిన వారు ఎందరో ఉన్నారు. అందుకే బంగారానికి అంత డిమాండ్ పెరిగింది. అదీ కాకుండా రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొంత మేర తగ్గినా బంగారాన్ని కొనుగోలు చేయడానికే ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు.

వెండి కూడా...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.100లు తగ్గింది. వెండి కూడా బాగానే తగ్గింది. కిలో వెండి ధర పై కూడా వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,100 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,830 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 71,700 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News