మగువలకు మంచి వార్త

దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి కూడా అదే బాటలో పయనించింది.

Update: 2022-12-30 04:44 GMT

బంగారం ధరలు పరుగులు తీస్తున్నాయి. ఎవరికీ అందనంత భారంగా మారుతున్నాయి. బంగారం నిజంగా బంగారంగానే మారిపోయింది. భారతీయులు అత్యంత ఇష్టపడే పసిడికి ఎప్పుడూ విలువ ఎక్కువే. తమ ఇంట్లో వస్తువుగా దానిని భావిస్తారు. అయితే పేద, మధ్య తరగతి ప్రజలకు మాత్రం రాను రాను బంగారం దూరమయిపోతుంది. కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయినా సంప్రదాయాలను పాటించే జనం తమకున్న కొద్దిపాటి సొమ్ముతో బంగారాన్ని కొనుగోలు చేయడానికే ఎక్కువగా ఇష్టపడతారు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలు బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. బంగారానికి డిమాండ్ ఎక్కువ కావడంతోనే ధరలు కూడా దిగి రావడం అరుదుగా కనిపిస్తుంది.

ధర తగ్గిన వెండి...
తాజాగా పసిడిప్రియులకు గుడ్ న్యూస్ చెప్పొచ్చు. బంగారం ధరలు కొంత దిగి వచ్చాయి. దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి కూడా అదే బాటలో పయనించింది. పది గ్రాముల బంగారం పై రూ.110 లు తగ్గింది. కిలో వెంి పై రూ.200లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,630 రూపాయలుగా కొనసాగుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,080 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర 74,000 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతుంది.


Tags:    

Similar News