ఒకరకంగా గుడ్ న్యూస్

దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది

Update: 2023-01-11 03:58 GMT

బంగారం ధరలు తగ్గాయని మురిసిపోవాల్సిన పనిలేదు. స్వల్పంగానే అవి తగ్గుతాయి. పెరిగితే మాత్రం భారీగా పెరుగుతాయి. అందుకు ధరలు తగ్గాయన్న విషయాన్ని కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. భారత్ అంటేనే బంగారానికి పెట్టింది పేరు. అందునా దక్షిణ భారత దేశంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. భారత్ అత్యధికంగా కొనుగోలు చేసే రాష్ట్రాల్లో ఈ నాలుగు ముందుంటాయని చెబుతుంటారు. అందుకే బంగారం ధరలు ఎంత పెరిగినా పెద్దగా పట్టించుకోకుండా కొనుగోలు చేస్తుంటారు.

స్థిరంగా వెండి ధరలు...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. పది గ్రాముల బంగారంపై 160 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,130 రూపాయలుగా కొనసాగుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,450 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర 73,700 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News