వావ్... ధరలు తగ్గాయిగా

దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గాయి

Update: 2023-04-25 03:26 GMT

అక్షర తృతీయ అటు వెళ్లిపోగానే బంగారం ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. అయితే పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో బంగారం ధరలు తగ్గడం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త అని చెప్పాలి. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీ పెంచడం, కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమలతులను తగ్గించడం వంటి కారణాలతో బంగారం ధరలు మరింత ప్రియంగా మారనున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో కొనుగోళ్లు కూడా కొంత మందగించాయి. బంగారం దుకాణాల యాజమాన్యం కూడా వివిధ రకాల డిజైన్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

వెండి కూడా...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,650 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,710 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర 80,000 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News