హ్యాపీ డే.. గోల్డ్ రేట్ ఎంతంటే?

దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది

Update: 2023-02-16 04:22 GMT

బంగారం ధరలు తగ్గితేనే కాదు స్థిరంగా ఉన్నా ఆనందమే. ఎందుకంటే బంగారం ధర పెరగడమే తప్ప తగ్గదు. తగ్గినా కొంత మాత్రమే తగ్గుతుంది. పెరిగితే భారీగా పెరుగుతుంది. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బంగారం ధర ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగింది. కేంద్రప్రభుత్వం దిగుమతిని తగ్గించడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. మరోవైపు బంగారం, వెండిలపై కస్టమ్స్ డ్యూటీని పెంచడం కూడా ధరలు పెరుగుదలకు కారణమని చెప్పకతప్పదు. ఎంత ధరలు పెరిగినా బంగారం కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. భారతీయ సంస్కృతిలో భాగమైనందున అవసరం అలా బంగారం దుకాణాల వైపునకు అడుగులు వేయిస్తుంది. దీంతోనే బంగారానికి ఎప్పుడూ డిమాండ్ తగ్గదు.

తగ్గిన వెండి....
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,400 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,160 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 72,000 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News