బంగారం ధరలకు బ్రేక్

దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో కూడా పెద్దగా మార్పులేదు

Update: 2023-04-18 03:59 GMT

బంగారం ధరలు రానున్న రోజుల్లో భారీగా పెరుగుతాయన్న నిపుణుల అంచనా నిజమయ్యేటట్లే ఉంది. ఇప్పటికే తులం బంగారం అరవై వేలు దాటింది. ఇక డెబ్భయి వేలకు చేరుకోవడానికి పెద్దగా సమయం పట్టదని నిపుణులు వాదన. మరో వైపు బంగారం ధరలు గణనీయంగా తగ్గుతాయని కూడా చెబుతున్నారు. ప్రపంచమంతా ద్రవ్యోల్బణం నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుముఖం పడతాయన్న వాదన కూడా లేకపోలేదు. అందుకే బంగారం ధరలు తగ్గుతాయోమోనని వెయిట్ చేసే వారు అనేక మంది ఉన్నారు. పెట్టుబడులు పెట్టేవారు కొంత కాలం ఆగితే ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. ఇక పెళ్లిళ్లు, శుభకార్యాలకు మాత్రం సంప్రదాయం ప్రకారం కొనుగోలు చేయాల్సి రావడంతో వారు మాత్రం అధిక ధరలైనా వెచ్చించి కొనుగోలు చేయక తప్పుదు.

వెండి కూడా...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో కూడా పెద్దగా మార్పులేదు. పసిడి కొనుగోలు చేయాలనుకున్న వారికి ధరలు పెరగకపోవడం శుభవార్తగానే చెప్పాల్సి ఉంటుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,040 రూపాయలుగా నమోదయి ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,030 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 81,600 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News