మేడే.. గోల్డ్ కొనుగోలు చేయొచ్చు

దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి.

Update: 2023-05-01 03:26 GMT

బంగారం అంటే నిజంగా బంగారంగానే మారిపోయింది. ధరలు పెరుగుతూ ఎవరికీ అందుబాటులో లేకుండా పోతున్నాయి. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం, కేంద్ర ప్రభుత్వం బంగారంపై కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో పాటు దిగుమతులను తగ్గించడం వల్ల కూడా ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సామాన్యులకు అందనంత దూరంలో ధరలు పెరిగాయి. ఈ ఏడాది తులం బంగారం డెబ్భయి వేల రూపాయలకు చేరుకుంటుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. దక్షిణ భారత దేశంలో బంగారు ఆభరణాలకు డిమాండ్ ఎక్కువగా ఉండటం, పెళ్లిళ్లు, శుభకార్యక్రమాలకు బంగారాన్ని కొనుగోలు చేయడం సంప్రదాయంగా మారడంతో దానికి పసిడికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. దానిని ఆసరాగా చేసుకుని జ్యుయలరీ వ్యాపారులు కూడా ధరలు పెంచడం మామూలే.

వెండి కూడా...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి. హైదరాబాద్‌లోని బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,850 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,930 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 80,400 రూపాయలుగా నమోదయి ఉంది.


Tags:    

Similar News