నేడు కొనేసుకోండి
దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి.
పసిడి ప్రియులు ఎప్పుడెప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయాలని చూస్తుంటారు. బంగారం ధరలు తగ్గితే వెంటనే కొనుగోలు చేసే వారు అనేక మంది ఉన్నారు. అందులో పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. దీనికి తోడు బంగారం ధరలకు కళ్లెం పడటం లేదు. ఇటీవల కాలంలో ధరలు పెరుగుతుండటంతో సామాన్య, మధ్య తరగతి వర్గాలు బంగారాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితి. ప్రధానంగా భారతీయ సంస్కృతిలో ఒక భాగంగా మారిన బంగారాన్ని కొనుగోలు చేయడానికి మహిళలు ఆసక్తిగా చూపుతారు. బంగారాన్ని స్టేటస్ సింబల్ గా భావించడంతో వాటి కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. కానీ అనేక కారణాలతో బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. అయినా సరే... వాటికి డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు.
వెండి కూడా...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి. రెండో రోజు స్థిరంగా కొనసాగటంతో పసిడి ప్రియులు కొనుగోళ్ల కోసం జ్యుయలరీ షాపులకు పరుగులు తీస్తున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,650 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,800 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర 78.500 రూపాయలుగా నమోదయింది.