పసిడి కొనాలనుకుంటున్నారా?

దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి

Update: 2023-05-12 04:42 GMT

బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేం. అంటే దాదాపు రోజూ బంగారం ధరలు పెరగడం పరిపాటిగా మారిపోయింది. అలవాట పడిపోయిన కొనుగోలుదారులు ధరలు పెరిగాయని పెద్దగా ఆందోళన చెందడం లేదు. ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నా ఏ కారణమూ సహేతుకం అనిపించదు. డిమాండ్‌ను బట్టి బంగారం ధరలు పెరుగుతాయన్నది వ్యాపార మౌలిక సూత్రం అంటున్నారు వ్యాపారులు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు పెరిగితే తమ వద్ద ఉన్న సొమ్ముల ప్రకారమే బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అంతే తప్ప స్థోమతకు మించి బంగారం కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రారు. మరికొందరు పెట్టుబడిగా చూస్తూ బంగారాన్ని కొనుగోలు చేస్తుండటం ఆనవాయితీగా వస్తుంది.

స్థిరంగా....
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,950 రూపాయలుగా కొనసాగుతుంది. 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,130 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్‌‌లో కిలో వెండి ధర స్వల్పంగా తగ్గి 82,000 రూపాయలుకు చేరుకుంది.


Tags:    

Similar News