పసిడి ప్రియులకు స్వీట్ న్యూస్

దేశంలో ఈరోజు బంగా ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి

Update: 2023-02-13 03:23 GMT

బంగారం ధరలు తగ్గితే ఆశ్చర్యం కాని.. పెరిగితే ఆశ్చర్యపడే రోజులు పోయాయి. ఎందుకంటే వారం రోజుల్లో ఐదు రోజులు గోల్డ్ రేట్స్ పెరుగుతూనే ఉంటాయి. బంగారానికి భారత్ లో ఉన్న డిమాండ్ అలాంటిది. భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారానికి ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం ఈ ఏడాది అత్యధికంగా ధరలు పెరిగే అవకాశముంది. తులం బంగారం 70 నుంచి ఎనభై వేలు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారు ఆభరణాలకు డిమాండ్ మరింత పెరిగింది. కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతిని తగ్గించడం, కేంద్ర బడ్జెట్ లో బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో ధరలు మరింత భారంగా మారనున్నాయని చెబుతున్నారు.

తగ్గిన వెండి ధరలు...
దేశంలో ఈరోజు బంగా ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి. ఇటీవల కాలంలో బంగారం ధరలు వరసగా పెరుగుతుండటంతో ఆందోళనలో ఉన్న బంగారం కొనుగోలు దారులకు కొంత ఊరట లభించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,600 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,380 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర 72,700 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News