గుడ్ న్యూస్ ...కొనాలనుకుంటే గుడ్ టైమ్

దేశంలో ఈరోజు బంారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల లేకపోవడం సంతోషకరమే.

Update: 2023-04-09 03:02 GMT

బంగారం ధరలు పెరుగుతుండటం సహజమే. దానికి అలవాటుపడి పోయారు కొనుగోలుదారులు. ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడే కొనుగోళ్లు చేయడం ప్రారంభించారు. గతంలో మాదిరి బంగారాన్ని ఎగబడే కొనుగోలు చేసే పరిస్థితులు మాత్రం ఇప్పుడు లేవనే చెప్పాలి. భారీగా ధరలు పెరగడం కారణంగానే కొనుగోళ్లు కూడా గతం కంటే మందగించాయని వ్యాపారులు చెబుతున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం వంటి కారణాలతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. పదేళ్ల నాటికి ఇప్పటికి బంగారం ధర రెట్టింపయింది. కొనుగోలు చేసే శక్తి చాలా మంది కోల్పోయినట్లయింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

వెండి ధర కూడా...
అయితే తాజాగా దేశంలో ఈరోజు బంారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల లేకపోవడం సంతోషకరమే. హైదరాబాద్ మార్కెట్‌‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,800 రూపాయల వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,870 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర 80,200 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News