బంగారం లాంటి న్యూస్

బంగారం ధరలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి కిలోకు రూ.200లు తగ్గింది

Update: 2022-12-21 04:03 GMT

బంగారం ధరలు తగ్గితే సంతోషపడేవాళ్లలో ముఖ్యులు మహిళలే. తమకిష్టమైన ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయమని వారు భావిస్తారు. అందుకే ధరలు తగ్గినప్పుడల్లా కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. బంగారాన్ని కేవలం ఆభరణాలుగా మాత్రమే చూడకుండా పెట్టుబడిగా భావించే వారు అనేక మంది ఉండటంతో దానికి డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుంది. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. అయితే ధరలు పెరిగితే భారీగా పెరగడం, తగ్గితే స్వల్పంగా తగ్గడం రివాజుగా మారింది. ధరలతో సంబంధం లేకుండా కొనుగోలు చేసే వారుకొందరయితే, అవసరానికి సరిపడా వస్తువులను కొనుగోలు చేసే వారు మరికొందరు. ఏదిఏమైనా.. ఏ సీజన్ లోనైనా బంగారానికి మాత్రం డిమాండ్ తగ్గదనేది వ్యాపారుల మాట.

స్వల్పంగా తగ్గిన వెండి ధర...
తాజాగా బంగారం ధరలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి కిలోకు రూ.200లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,110 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,600 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 72,500 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News