బంగారం ధరలకు బ్రేక్

ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో మాత్రం తగ్గుదల కనిపించింది. కిలో వెండి పై రూ.400లు తగ్గింది

Update: 2023-01-18 03:50 GMT

గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు నేడు బ్రేక్ పడింది. నేడు బంగారం ధరలు పెరగలేదు. తగ్గలేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. సహజంగా కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయితో తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సంక్రాంతి పండగ ముందు రోజు నుంచి వరసగా రోజు బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు బంగారాన్ని కొనాలంటేనే భయపడి పోయే పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధరలతో సామాన్యులకు పసిడి దూరమవుతుంది. భారతీయ సంస్కృతి లో భాగమైన బంగారాన్ని కొనుగోలు చేయాలంటే మధ్యతరగతి ప్రజలకు కూడా భారంగా మారింది. దీంతో వెండి కూడా అదే బాటలో పయనిస్తుండటం విశేషం.

తగ్గిన వెండి...
తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో మాత్రం తగ్గుదల కనిపించింది. కిలో వెండి పై రూ.400లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,200 రూపాయల వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,950 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర 75,300 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News