గోల్డ్ రేట్స్ ఈరోజు ఇలా
ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధర కూడా అదే బాటలో పయనిస్తుంది
బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేం. అందుకే తగ్గనప్పుడే కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. బంగారానికి ఉన్న డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. కానీ బంగారం కొనుగోలు చేయాలంటే మహిళలకు తమకు ఇష్టమైన డిజైన్లు మార్కెట్ లో లభ్యమవ్వాలి. కొత్త కొత్త డిజైన్లతో మార్కెట్ లో అనేక జ్యుయలరీ షాపులు మన ముందుకు వస్తున్నాయి. ప్రధానంగా గాజులు, హారాలు ఒకరి శరీరంపై చూసిన మోడల్ ను ధరించడానికి మరో మహిళ ఇష్టపడదు. మరికొంత వెరైటీగా కావాలనుకుంటుంది. అందుకే అనేక బంగారు ఆభరణాలు వివిధ రకాల డిజైన్లలో రూపొందించడానికి ప్రత్యేకంగా సిబ్బందిని యాజమాన్యం నియమించుకుందని చెబుతారు. బంగారంలో మేలురకం కన్నా డిజైన్లనే ఎక్కువగా ఇష్టపడుతున్నారని జ్యుయలరీ షాపు యజమానులు చెబుతుండటం విశేషం. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి.