బంగారం కొనాలంటే ఇక కష్టమేనా?
ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి కిలో పై రెండు వందల రూపాయలు తగ్గింది
బంగారం ధరలు అంటేనే మండిపోతుంటాయి. కొనుగోలు చేయలేని స్థితికి చేరుకున్నాయి. బంగారం అపురూపమైన వస్తువుగా మారింది. చిన్న వస్తువు బంగారంతో తయారు చేయించుకోవాలనుకున్నా తలకు మించిన భారంగా మారుతుంది. బంగారానికి ఉన్న డిమాండ్ పెరగడం వల్లనే రేట్లు కూడా అధికంగా పెరిగాయి. కేంద్ర బ్యాంకుల్లో నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పేదలు కొనుగోలు చేసే పరిస్థితి నుంచి క్రమంగా బంగారానికి మధ్య తరగతి కూడా దూరమయ్యే పరిస్థితికి చేరుకుంటుంది. కేవలం ఎగువ మధ్యతరగతి, ధనికుల వస్తువుగానే బంగారం మిగిలిపోతుందన్నది ఎంతో దూరం లేదు.
స్వల్పంగా తగ్గిన వెండి....
తాజాగా ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి కిలో పై రెండు వందల రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,970 రూపాయలుగా కొనసాగుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,550 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర మాత్రం 68,000 రూపాయలకు చేరుకుంది.