షాకింగ్ : బంగారం భారమే

బంగారం ధరలు ఈరోజు దేశ వ్యాప్తంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.200ల వరకూ పెరిగింది. వెండి ధర స్వల్పంగా తగ్గింది.

Update: 2022-12-08 03:25 GMT

బంగారం ధరలు అంటేనే అంత. ఒకరోజు ధరలు తగ్గాయని సంతోషపడే లోపు మరుసటిరోజు ధరలు భారీగా పెరగడం మామూలూగా మారింది. ఎప్పుడూ అంతే. తగ్గిందని సంతోషపడటానికి లేదు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు సహజంగా పెరుగుతాయని ఎవరైనా అంచనా వేస్తారు. నిన్న పది గ్రాముల బంగారంపై రూ.300ల వరకూ తగ్గడంతో ఆనందపడినంత సేపు లేదు. ఈరోజు మళ్లీ ధరలు పెరిగాయి. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాల వల్ల బంగారం ధరలు పెరుగుదల, తగ్గుదల ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలకు బంగారం కొనాలంటే భయపడిపోయే పరిస్థితి ఉంది.

తగ్గిన వెండి ధరలు...
తాజాగా బంగారం ధరలు ఈరోజు దేశ వ్యాప్తంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.200ల వరకూ పెరిగింది. వెండి ధర స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,000 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,500 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 71,000 రూపాయల వద్ద కొనసాగుతుంది.


Tags:    

Similar News