పెరుగుతూనే ఉన్న బంగారం ధర

ఈరోజు బంగారం ధరలు దేశంలో మళ్లీ పెరిగాయి. స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి

Update: 2023-01-05 03:54 GMT

బంగారానికి ఒక సీజన్ అంటూ లేకుండా పోయింది. ఎప్పడు పడితే అప్పుడు కొనుగోలు చేస్తున్నారు. తమ వద్ద డబ్బులు సమకూరినప్పుడు ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుండటంతో దానికి డిమాండ్ పెరిగింది. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం ధరలు పెరుగుతూనే పోతున్నాయి. తగ్గడం అనేది జరగడం లేదు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలకు బంగారం అందని వస్తువుగా మారింది. కొందరికే బంగారం అనువైన వస్తువుగా మారింది. రానున్న కాలంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కొనుగోలుశక్తి పెరగకపోవడం, ధరలు పెరగుతూ పోతుండటంతో బంగారం అపురూపమైన వస్తువుగా మారింది.

స్థిరంగా వెండి....
తాజాగా ఈరోజు బంగారం ధరలు దేశంలో మళ్లీ పెరిగాయి. స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.150లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,100 రూపాయలు పలుకుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,750 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర 75,500 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News