నవమి రోజు పసిడిప్రియులకు చేదువార్త
ఈరోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.200లు పెరిగింది. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి
బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో? ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేం. ఒక రోజు స్వల్పంగా బంగారం ధరలు తగ్గితే ఆరు రోజులు వరసగా భారీగా ధరలు పెరుగుతాయి. అందుకే బంగారం కొనుగోలు చేయాలంటే ఇటీవల కాలంలో గగనమయిపోయింది. పది గ్రాములు లేనిది ఏ ఆభరణమూ రావడం లేదు. పది గ్రాములు పెట్టి కొనడానికి జంకుతున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం వంటి కారణాలతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇక పెళ్లిళ్ల సీజన్ కూడా వస్తుండటంతో బంగారానికి మరింత డిమాండ్ పెరుగుతుంది. దీంతో ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తులం బంగారం డెబ్భయి వేల రూపాయలకు చేరుకుంటుందని సూచిస్తున్నారు.
స్థిరంగా వెండి ధరలు...
ఈ నేపథ్యంలో దేశంలో ఈరోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.200లు పెరిగింది. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,700 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,670 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 75,700 రూపాయలుగా స్థిరంగా కొనసాగుతుంది.