మగువలకు షాక్... పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు రెండో రోజు కూడా పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.160లు వరకూ పెరిగింది. కిలో వెండి పై రూ.680లు పెరిగింది

Update: 2022-09-07 02:50 GMT

బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేం. దానికి కారణాలు అనేకం. బంగారానికి ఉన్న డిమాండ్ ను బట్టి దాని ధరల నిర్ణయం ఉంటుంది. సీజన్ తో సంబంధం లేకుండా కొనుగోళ్లు జరుగుతుండటంతో బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతుందో, తగ్గుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రజలు కూడా తమ దగ్గర డబ్బులున్నప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయడానికి అలవాటు పడ్డారు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి అంటారు. అందుకే బంగారం ధరలను భారతీయులు పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. పెట్టుబడిగా చూసేవారు కొందరైతే, ఆభరణాలుగా చూసేవారు మరికొందరు ఉండటంతో ఎప్పుడూ బంగారం షాపులు కిటకిట లాడుతూనే ఉంటాయి.

హైదరాబాద్ మార్కెట్ లో...
తాజాగా బంగారం ధరలు రెండో రోజు కూడా పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.160లు వరకూ పెరిగింది. కిలో వెండి పై రూ.680లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,160 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,900 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర 59,200 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News