సంక్రాంతికి షాకిచ్చిన బంగారం ధరలు
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం పై వంద రూపాయలు పెరిగింది.
బంగారం ధర పెరగడం మామూలే. అయితే పండగ పూట పెరగడం మాత్రం కొనుగోలుదారులకు షాకింగ్ గానే చెప్పుకోవాలి. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. బంగారం ధర పెరగకపోతే ఆశ్చర్యం కాని, తగ్గితే ఆశ్చర్యం లేదని పసిడి ప్రియులు మానసికంగా సిద్ధమయ్యారు. తమ వద్ద డబ్బులు ఉన్నప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయడానికే ఎక్కువగా ఇష్టపడతారు. అప్పు చేసైనా బంగారం కొనుగోలు చేసే రోజులు పోయాయి. తమ వద్ద దాచుకున్న డబ్బులతోనే బంగారాన్ని కొనుగోలు చేసే రోజులు వచ్చాయి. మరికొందరు బంగారాన్ని పెట్టుబడిగా భావించడంతో దీని డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. అందుకే ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి.
వెండి కూడా...
తాజాగా సంక్రాంతి వేళ ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం పై వంద రూపాయలు పెరిగింది. వెండి కూడా అదే బాటలో పయనిస్తుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,400 రూపాయలు పలుకుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,070 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర 74,000 రూపాయలుగా నమోదయింది.