పసిడిని ముట్టుకుంటేనే...?

ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై 250 రూపాయలు పెరిగింది. వెండి ధరలు కూడా పెరిగాయి

Update: 2023-05-11 02:55 GMT

బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. అయితే అందుకు అలవాటుపడిపోయిన కొనుగోలు దారులు మాత్రం తమ వద్ద కొద్ది పాటి డబ్బులున్నా కొనుగోళ్లు ఎక్కువగా చేస్తుంటారు. అందులో పెళ్లిళ్ల సీజన్ కావడంతో భారతీయ సంప్రదాయంలో బంగారం కొనుగోలు చేయాల్సి రావడంతో డిమాండ్ అధికమయింది. శుభకార్యాలకు కూడా బంగారం కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తున్న ఆచారం కావడంతో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ పడిపోదు. దానిని ఆసరాగా చేసుకుని ధరలు పెంచేందుకు వ్యాపారులు ఏమాత్రం సంకోచించరు. బంగారం ధరల పెరుగుదలకు అనేక కారణాలున్నప్పటికీ మరీ పేద, మధ్యతరగతి ప్రజలకు అందనంత దూరంగా మారిపోతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. రానున్న రోజుల్లో మధ్య తరగతి ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితి చూడబోతున్నామని చెప్పేవారు కూడా ఉన్నారు. ఇప్పటికే బంగారం లాగే మెరిసిపోయే జ్యుయలరీ వచ్చి కొందరిని శుభకార్యాల సమయంలో కాపాడుతున్నాయి. ఇమిటేట్ జ్యుయలరీకి కూడా డిమాండ్ ఎక్కువగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

వెండి కూడా...
దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై 250 రూపాయలు పెరిగింది. వెండి ధరలు కూడా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,950 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,130 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 82,700 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News