పరుగులు పెడుతున్న పసిడి

ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం పై 350 రూపాయలు పెరిగింది

Update: 2023-01-25 03:13 GMT

బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. దానికి అనేక కారణాలు చెబుతుంటారు నిపుణులు. ఒకరోజు తగ్గితే ఐదురోజులు ధరలు పెరగడం బంగారం విషయంలోనే సాధ్యమవుతుంది. ప్రతిరోజూ ధరలు పెరుగుతుండటంతో మధ్య, పేద తరగతికి బంగారం భారంగా మారింది. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతాయంటారు మార్కెట్ నిపుణులు. రూపాయిని బలోపేతం చేసేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులను కూడా తగ్గించింది. సీజన్ తో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తుండటంతో బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతుంటాయి. ఎంతగా అంటే పెరిగితే భారీగా, తగ్గితే స్వల్పంగా. అయితే వీటికి కొనుగోలుదారులు కూడా అలవాటుపడిపోయారు. తమ అవసరాలను బట్టి కొనుగోలు చేస్తుండటంతో బంగారానికి వన్నె తగ్గనట్లుగానే డిమాండ్ కూడా తగ్గట్లేదు.

భారీగా వెండి...
ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం పై 350 రూపాయలు పెరిగింది. కిలో వెండి పై 200 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,700 లకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.57,490 లుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 74,000 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News