పసిడి మరింత ప్రియం

ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. తులం బంగారం 62 వేల రూపాయలకు చేరుకుంది. వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది.

Update: 2023-05-14 02:52 GMT

బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయంటే.. రోజూ అని చెప్పక తప్పని రోజు వస్తుందేమో. ఎందుకంటే బంగారం ధరలు రోజూ పెరుగుతాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. తగ్గినా తక్కువ సార్లు ధరలు తగ్గాల్సిందే తప్పించి ఎక్కువ సార్లు ధరలు పెరిగే అవకాశముంది. ఇది అందరికీ తెలిసినా బంగారం కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు మరింత ప్రియంగా మారనున్నాయి. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం, కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ పెంచడం, కేంద్రం బంగారం దిగుమతులను తగ్గించిన కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నా.. ఇవి సహేతుకమైన కారణాలు కాదనిపిస్తుంది. డిమాండ్‌‌కు బట్టి ఏ వస్తువుకైనా ధరలు పెంచుతారు. అలాగే ప్రస్తుత సీజన్‌లో డిమాండ్ అధికంగా ఉన్న బంగారం ధరలు కూడా అలాగే పెరుగుతున్నాయన్నది మార్కెట్ నిపుణుల అంచనా.

వెండి కూడా...
దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. తులం బంగారం 62 వేల రూపాయలకు చేరుకుంది. వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,650 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,800 రూపాయలుగా నమోదయింది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర 78,500 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News