గోల్డ్ రేట్స్ దిగివచ్చాయ్

ఈరోజు బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం పై రూ.550లు తగ్గింది.

Update: 2022-09-08 02:43 GMT

బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉండటం సహజం. అయితే తగ్గినప్పుడే బంగారాన్ని కొనుగోలు చేయాలని ఎంతోమంది ఎదురు చూస్తుంటారు. అలాగే ధరలతో సంబంధం లేకుండా ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. భారతీయులలో అత్యధిక శాతం రెండో కోవకు చెందిన వారే. ఇప్పుడు సీజన్, ధరలకు సంబంధం లేకుండా కొనుగోళ్లు జరుగుతుండటంతోనే వీధికో జ్యుయలరీ షాపు వెలుస్తుంది. బంగారం ఎప్పటికీ తగ్గదు. తగ్గినా ధర పెరుగుతుందన్న ఒకే ఒక్క ఆశతో దానిని తమ వద్ద డబ్బులు ఉన్నప్పుడు కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. గత రెండు రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి.

వెండి కూడా...
అయితే ఈరోజు బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం పై రూ.550లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.50,620లుగా ఉంది. 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర రూ.46,400లుగా ఉంది. వెండి ధర కూడా కూడా తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 58,800 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News