కొనుగోలుదారులకు ఊరట

కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధర కూడా స్థిరంగానే కొనసాగుతుంది

Update: 2022-12-26 03:38 GMT

బంగారం భారతీయ మహిళలకు అత్యంత ప్రీతి. బంగారం వస్తువులను కొనుగోలు చేయడానికి మహిళలు నిత్యం పరితపిస్తుంటారు. తమకు ఉన్న బంగారం బట్టే తమకు విలువ సమాజంలో ఉంటుందని భావిస్తారు. అందుకే బంగారానికి భారత్ లో డిమాండ్ అధికంగా ఉంటుంది. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణంగా బంగారం ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. అయితే రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధరలు సామాన్యులకు దూరం చేస్తున్నాయి. బంగారం అనేది కొందరి వస్తువుగానే మారిపోయింది. ఈ నేపథ్యంలో జ్యుయలరీ షాపులు స్కీమ్ లో పేద, మధ్యతరగతి ప్రజలను ఆకర్షించేందుకు ముందుకు వస్తున్నాయి.

వెండి కూడా...
తాజాగా పసిడి ధరల్లో ఎలాంగి మార్పు లేదు. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధర కూడా స్థిరంగానే కొనసాగుతుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,380 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,850 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ 74,000 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News