గుడ్ న్యూస్ ....స్థిరంగా బంగారం ధరలు
గత రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధర కూడా పెరగలేదు
బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో? ఎప్పడు తగ్గుతాయో చెప్పలేం. బంగారాన్ని సేకరించడం ఇక అలవాటుగా మారిన వారు కొందరైతే ఇష్టపడి కష్టపడి కొనుగోలు చేసే వారు మరికొందరు. ఎక్కువ శాతం పేద, మధ్య తరగతి ప్రజలు తమ వద్ద ఉన్న డబ్బులతో బంగారాన్ని కొనుగోలు చేయడానికే ఇష్టపడతారు. దానికి ఉన్న విలువ ఆపాటిది. బంగారం ధరల పెరుగుదల కొనుగోళ్లను ఆపడం లేదు. డాలర్ విలువ తగ్గడం బంగారం పెరగడానికి కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు కూడా బంగారం ధరల్లో మార్పులకు కారణంగా చెప్పవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడతారు.
ధరలు ఇలా....
గత రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధర కూడా పెరగలేదు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,000 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,750 రూపాయలు ఉంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 64.400 రూపాయలు పలుకుతుంది.