పసిడి ధరలకు బ్రేక్
గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగతున్నాయి. వెండి కూడా అదే బాటలో పయనిస్తుంది
బంగారం భారతీయ సంస్కృతిలో భాగమయిపోయింది. పసిడి అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. తమ ఇంట్లో ఒక వస్తువుగా మారిపోయింది. అలాంటి బంగారాన్ని అనేక రకాల డిజైన్లతో కళ్లు మెరిసేలా మనముందు ఉంచుతున్నాయి జ్యుయలరీ షాపులు. దీంతో ఏ మాత్రం కొనుగోలు శక్తి ఉన్నా వెంటనే బంగారం వైపు దృష్టి పెడుతున్నారు భారతీయులు. అందుకే భారత్ లో బంగారానికి అంత డిమాండ్. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడి దుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుటున్నాయి.
స్థిరంగా వెండి....
గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగతున్నాయి. వెండి కూడా అదే బాటలో పయనిస్తుంది. ఇది పసిడిప్రియులకు ఊరటనిచ్చే అంశంగానే చెప్పుకోవాలి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,290 రూపాయల వద్ద కొనసాగుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,010 రూపాయల వద్ద నిలిచిపోయింది. ఇక కిలో వెండి ధరల 63,200 రూపాయలు పలుకుతుంది.