తగ్గిన బంగారం.. పెరిగిన వెండి

నిన్నటి వరకూ స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు నేడు తగ్గాయి. ఇది కొంత ఊరటనిచ్చే అంశం. అయితే వెండి ధరలు మాత్రం పెరిగాయి

Update: 2022-07-13 02:16 GMT

gold silver rates in hyderabad

నిన్నటి వరకూ స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు నేడు తగ్గాయి. ఇది కొంత ఊరటనిచ్చే అంశం. అయితే వెండి ధరలు మాత్రం విపరీరతంగా పెరిగాయి. బంగారం ధరల హెచ్చు తగ్గుదలపై అనేక ప్రభావాలు పనిచేస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు చెబుతున్నారు. వచ్చే నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండంటంతో కొనుగోళ్లు ఊపందుకుంటాయన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.

ధరలు ఇలా....
దేశ వ్యాప్తంగా ఈరోజు బంగారం ధరలు తగ్గగా, వెండి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం పై 150 రూపాయలు, కిలో వెండిపై 5,300 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా న్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,054 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,800 రూపాయలు ఉంది. ఇక కిలో వెండి ధర 62,500 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News