నేడు గుజరాత్ ఎన్నికల షెడ్యూల్?

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈరోజు వెలువడే అవకాశాలున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటిస్తుందని చెబుతున్నారు

Update: 2022-11-03 03:52 GMT

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈరోజు వెలువడే అవకాశాలున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు షెడ్యూల్ ను ప్రకటిస్తుందని చెబుతున్నారు. మధ్యాహ్నం ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు గుజరాత్ షెడ్యూల్ ను కూడా విడుదల చేసే అవకాశముంది.

డిసెంబరులో పోలింగ్...
డిసెంబరు నెలలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఈరోజు దేశ వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. దానిపైన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారా? లేదా గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ కోసమేనా అన్నది మరి కాసేపట్లో తేలనుంది.


Tags:    

Similar News