Breaking : ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
ఝార్ఖండ్ సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో శాసనసభ పక్ష నేతగా చెంపై సోరెన్ ఎన్నికయ్యారు.
ఝార్ఖండ్ సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో శాసనసభ పక్ష నేతగా చెంపై సోరెన్ ఎన్నికయ్యారు. చంపై సోరెన్ రాష్ట్ర గవర్నర్ ను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారన్న ప్రచారం గత రెండు రోజులుగా జరుగుతూనే ఉంది.
అరెస్ట్ అవుతారని...
ఆయన భూకుంభకోణంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇటీవల ఆయన ఇంట్లో సోదాలు కూడా నిర్వహించారు. తనను ఈ కేసులో అరెస్ట్ చేస్తారని భావించిన హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. మరికాసేపట్లో హేమంత్ సోరెన్ ఈడీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశముంది.