పాక్షిక లాక్ డౌన్ దిశగా భారత్

భారత్ లో ఒమిక్రాన్ కేసులతో పాటు కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రాలన్నీ అప్రమత్తమయ్యాయి

Update: 2022-01-02 02:46 GMT

భారత్ లో ఒమిక్రాన్ కేసులతో పాటు కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రాలన్నీ అప్రమత్తమయ్యాయి. లాక్ డౌన్ కాకపోయినా ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ముందు జాగ్రత్త చర్యగా తమ రాష్ట్ర ప్రజలను వైరస్ నుంచి కాపాడుకోవడానికి చర్యలు ప్రారంభించాయి. ఇప్పటికే తమిళనాడు, మహారాష్ట్ర, కేరళలో యాభై శాతం ఆక్యుపెన్సీతో మాల్స్, సినిమా హాళ్లను తెరవాలని నిర్ణయించారు. ఢిల్లీలో పూర్తిగా మూసివేశారు.

హర్యానాలోనూ....
ఇక తాజాగా హర్యానాలో కూడా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్రం ఆంక్షలను మరింత కఠిన తరం చేసింది. ఢిల్లీకి ఆనుకునే ఉండటంతో ఇక్కడ కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. జనవరి 12వ తేదీ వరకూ సినిమా థియేటర్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు, స్విమ్మింగ్ పూల్స్, పర్యాటక ప్రదేశాలు, పార్కులు మూసివేయాలని హర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఇక్కడ నైట్ కర్ఫ్యూను ప్రారంభించారు. అన్ని రాష్ట్రాలూ పాక్షిక లాక్ డౌన్ దిశగా చర్యలు ప్రారంభించాయనే చెప్పాలి.


Tags:    

Similar News