షాకింగ్... పెరిగిన బంగారం, వెండి
దేశంలో ఈరోజు బంగారం పది గ్రాముల పై రూ330లు పెరిగింది. వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి.
బంగారం అంటేనే అందరికీ ప్రీతి. అది ఆభరణాలుగా చూసుకోవడానికి కావచ్చు. లేదా ఇంట్లో ఉంటే గౌరవం పెరుగుతుందని భావంచవచ్చు. భారత్ లో బంగారం అంటేనే ఒక గౌరవనీయమైన వస్తువుగా చూస్తారు. ముఖ్యంగా మహిళలు తమను సమాజంలో అందరూ గౌరవప్రదంగా చూడాలంటే బంగారం ఉండాలని కోరుకుంటారు. బంగారం విషయంలో ఇంత లిమిట్ ఉండదు. కొంత బంగారం ఉన్నా ఇంకా కావాలనుకునేది భారత్ లోనే ఎక్కువ. ఆభరణాలు మాత్రమే కాకుండా భవిష్యత్ లో పనికి వస్తుందని భావించి, వారసత్వ వస్తువగా కూడా బంగారాన్ని భావించడం వల్లనే దానికి డిమాండ్ ఎక్కువ. అందుకే బంగారం కొనుగోళ్లు భారత్ లో ఎక్కువగా జరుగుతుంటాయి.
హైదరాబాద్ మార్కెట్ లో....
తాజాగా దేశంలో ఈరోజు బంగారం పది గ్రాముల పై రూ330లు పెరిగింది. వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం 50,980 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల పది గ్రాముల బంారం ధర 46,400 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర హైదరాబాద్ లో 57,000ల వరకూ పలుకుతుంది.