భారత్ లో స్వల్పంగా తగ్గిన కేసులు
భారత్ లో 17,070 కరోనా కేసులు నమోదయ్యాయి. 23 మంది కరోనా కారణంగా మరణించారు.
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఒక్కరోజులో 17,070 కరోనా కేసులు నమోదయ్యాయి. 23 మంది కరోనా కారణంగా మరణించారు. నిన్న ఒక్కరోజులో కోవిడ్ నుంచి 14,413 మంది కోలుకున్నారు. కోలుకున్న వారి శాతం 98.55 శాతానికి పెరిగింది. అలాగే యాక్టివ్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగాయి. యాక్టివ్ కేసుల శాతం 024గా నమోదయిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు....
ఇక ఇప్పటి వరకూ భారత్ లో 4,34,69,234 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటి వరకూ భారత్ లో 5,25,139 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసులు 1,07,189 ఉన్నాయి. కోవిడ్ బారిన పడి ఇప్పటి వరకూ 4,28,36,906 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ భారత్ లో 1,97,74,71,041 డోసుల వ్యాక్సినేషన్ జరిగిందని అధికారులు వెల్లడించారు.