చంటిపిల్లల తల్లులకోసం రైల్వేశాఖ వినూత్న నిర్ణయం..

ఇకపై తల్లులకు అలాంటి ఇబ్బందులుండవు. ప్రయాణ సమయంలో తల్లులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో..

Update: 2022-05-10 11:22 GMT

లక్నో : చంటిపిల్లల తల్లులకోసం రైల్వేశాఖ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ చిన్నపిల్లలున్న తల్లులు.. ఇబ్బందిగా ఉన్నా పిల్లలను తమ పక్కనే బెర్త్ పై పడుకోపెట్టుకునేవారు. కానీ.. ఇకపై తల్లులకు అలాంటి ఇబ్బందులుండవు. ప్రయాణ సమయంలో తల్లులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న రైల్వే శాఖ రైలులో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా.. బేబీ బెర్త్‌లను అందుబాటులోకి తెచ్చింది. నార్తర్న్‌ రైల్వే డివిజన్‌ అధికారులు చంటిపిల్లలు ఉన్న తల్లుల కోసం బేబీ బెర్త్‌లను అందుబాటులోకి తెచ్చారు. ఆ డివిజన్‌కు చెందిన ఇంజనీర్లతో కలిసి లోయర్ బెర్తులలో మార్పులు చేసి, బేబీ బెర్త్ లను అటాచ్ చేశారు.

ఈ సౌకర్యం తొలిసారిగా లక్నో మెయిల్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అక్కడ మంచి స్పందన వస్తే.. ఇతర రైళ్లలోనూ బేబీ బెర్త్ లను అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు పేర్కొన్నారు. "మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో..లక్నో మెయిల్‌లోని కోచ్ నెం 194129/ B4, బెర్త్ నం 12 & 60లో బేబీ బెర్త్ ప్రవేశపెట్టబడింది. తల్లులు తమ బిడ్డతో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించారు. అమర్చిన బేబీ సీటు కీలులో మడతపెట్టి, స్టాపర్‌తో సురక్షితంగా ఉంటుంది" అని NR యొక్క లక్నో డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) ట్వీట్ చేశారు.




Tags:    

Similar News