గుడ్ న్యూస్... ధరలు తగ్గాయ్

బంగారం ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిది. ఇది మార్కెట్ నిపుణులు సూచన.

Update: 2022-10-21 03:06 GMT

బంగారం ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిది. ఇది మార్కెట్ నిపుణులు సూచన. ఎందుకంటే దీపావళికి ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే బంగారం ధరలు పెరగడంతో సంబంధం లేకుండా కొనుగోళ్ల జరుగుతుండటంతో వ్యాపారులు కూడా కొత్త డిజైన్లతో ముందుకు వస్తున్నారు. బంగారాన్ని కేవలం అలంకారంగా చూసే రోజులు పోయాయి. బంగారాన్ని మేని మీద తక్కువగా ఉన్నతస్థాయి మహిళలు వాడుతున్నారు. పండగలు, ఫంక్షన్లు, వివాహాలు వంటి వాటికే దీనిని ఎక్కువగా ఉపయోగించడం అలవాటుగా మారింది. అయినా కష్టకాలంలో పెట్టుబడిగా భావిస్తూ బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడతున్నారు.

వెండి కూడా...
తాజాగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ.200 ల వరకూ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,650 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,350 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ లో 61,000 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News