సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ ప్రమాణం

సుప్రీంకోర్టు భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు

Update: 2022-11-09 05:27 GMT

సుప్రీంకోర్టు భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ద్రౌపది ముర్ము జస్టిస్ చంద్రచూడ్ చేత ప్రమాణం చేయించారు. నిన్న జస్టిస్ యు. యు. లలిత్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో జస్టిస్ డివై చంద్రచూడ్ నియమితులయ్యారు.

రెండేళ్ల పాటు...
రెండేళ్ల పాటు జస్టిస్ చంద్రచూడ్ పదవిలో ఉండనున్నారు. ఆయన తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. తన తండ్రి తర్వాత కుమారుడిగా డీవై చంద్రచూడ్ సీజేఐగా పదవీ బాధ్యతలను చేపట్టారు. మహారాష్ట్రకు చెందిన చంద్రచూడ్ కు పలువురు అభినందనలు తెలిపారు.


Tags:    

Similar News