గుండెపోటుతో 12ఏళ్ల బాలుడు మృతి

మడికేరి జిల్లా కుశాలనగర తాలూకా కూడుమంగళూరులో ఆరో తరగతి చదువుతున్న కీర్తన్ అనే బాలుడు గుండెపోటుతో మరణించాడు

Update: 2023-01-09 07:03 GMT

సహజంగా నలభై ఏళ్లు దాటిన వారికి గుండెపోటు వస్తుందని వైద్యులు చెబుతారు. మెడికల్ హిస్టరీ కూడా ఇదే చెబుతుంది. కానీ పన్నెండేళ్ల బాలుడు గుండె పోటుతో మరణించిన సంఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. కర్ణాటకలోన మడికేరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. మడికేరి జిల్లా కుశాలనగర తాలూకా కూడుమంగళూరులో ఆరో తరగతి చదువుతున్న కీర్తన్ అనే బాలుడు గుండెపోటుతో మరణించాడు.

ఆడుకుని వచ్చి...
కీర్తన్ తండ్రి మంజుచారి మంగుళూరులోనే పాఠశాల బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నారు. కీర్తన్ ఆరో తరగతి చదువుతున్నాడు. సాయంత్రం ఆడుకుని ఇంటికి వచ్చిన కీర్తన్ గుండెలో నొప్పి ఉందని చెప్పారు. కుటుంబ సభ్యులు వెంటనే కుశాలనగర ఆసుపత్రికి తరలించాడు. అయితే వైద్యులు పరీక్షించి గుండెపోటుతో కీర్తన్ చనిపోయాడని తెలిపారు. అప్పటి వరకూ ఆడుకుని వచ్చిన కీర్తన్ గుండెపోటుతో చనిపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.


Tags:    

Similar News