మార‌నున్న‌ 'కేరళ' పేరు

కేరళ రాష్ట్రం పేరు మారే అవ‌కాశం ఉంది. ఈ మేర‌కు రాష్ట్రం పేరు మార్చాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్

Update: 2023-08-09 10:59 GMT

కేరళ రాష్ట్రం పేరు మారే అవ‌కాశం ఉంది. ఈ మేర‌కు రాష్ట్రం పేరు మార్చాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం అసెంబ్లీలో తీర్మానం చేశారు. బిల్లు కూడా ఆమోదించబడింది. దీంతో పేరు మార్పు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు.

ఈరోజు అసెంబ్లీలో సీఎం పినరయి మాట్లాడుతూ.. “భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పొందుపరిచిన అన్ని భాషల్లో రాష్ట్ర అధికారిక పేరును ‘కేరళం’గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ.. ఈ సభలో రూల్ 118 కింద తీర్మానం చేస్తున్నామ‌ని పేర్కొన్నారు.

రాష్ట్ర‌ ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించబడింది. రాష్ట్రంలోని ప్రతిపక్ష కూటమి యుడిఎఫ్ (యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్) ఎలాంటి సవరణలు, మార్పులు సూచించకుండానే ప్రతిపాదనకు ఓకే చెప్పింది. మన మలయాళంలో 'కేరళం' అని.. ఇతర భాషల్లో కేరళ అని పిలుస్తారని సీఎం చెప్పారు.

అంత‌కుముందు దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (యుసిసి) అమలు నిర్ణయానికి వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష, తొందరపాటు చర్య రాజ్యాంగంలోని లౌకిక స్వభావాన్ని అంతం చేస్తుందని సభ విశ్వసిస్తోందని తీర్మానం సంద‌ర్భంగా నేత‌లు అభిప్రాయ‌ప‌డ్డారు.


Tags:    

Similar News