కోవిడ్ ఎఫెక్ట్.. అక్కడ కూడా 31 వరకూ స్కూళ్లకు సెలవులు
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలవుతుండగా.. మరికొన్ని రాష్ట్రాలు వారాంతపు లాక్ డౌన్లు అమలు చేస్తున్నాయి. అలాగే స్కూళ్లు, ఇతర విద్యాసంస్థలకు చాలా రాష్ట్రాలు ఈ నెలాఖరు వరకూ సెలవులు ప్రకటించాయి. తాజాగా
భారత్ లో కరోనా విజృంభణ తీవ్రస్థాయిలో ఉంది. రోజుకు రెండు లక్షల కేసులు నమోదవుతుండటం చూస్తుంటే.. ఫస్ట్, సెకండ్ వేవ్ ల కన్నా థర్డ్ వేవ్ వ్యాప్తి ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు. ఒమిక్రాన్, కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో.. దేశంలో రాష్ట్రాలు ఒక్కొక్కటిగా ఆంక్షల వలయంలోకి వెళ్లిపోతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలవుతుండగా.. మరికొన్ని రాష్ట్రాలు వారాంతపు లాక్ డౌన్లు అమలు చేస్తున్నాయి.
అలాగే స్కూళ్లు, ఇతర విద్యాసంస్థలకు చాలా రాష్ట్రాలు ఈ నెలాఖరు వరకూ సెలవులు ప్రకటించాయి. తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లను (1 నుంచి 12వ తరగతి వరకు) ఈనెల 31వ తేదీ వరకూ మూసివేయనున్నట్లు ప్రకటించింది. అలాగే రాజకీయ, మతపరమైన కార్యక్రమాలతో పాటు ఇతర వేడుకలపై కూడా నిషేధం విధించింది. అయితే మకర సంక్రాంతి స్నానాలపై మాత్రం నిషేధం లేదని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.