2024లో ప్రధానిగా మమత, బెంగాల్ సీఎంగా అభిషేక్ బెనర్జీ ప్రమాణ స్వీకారం చేస్తారు
2036లో అభిషేక్ బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ ట్విట్టర్‌లో పేర్కొన్న ఒక రోజు తర్వాత
2036లో అభిషేక్ బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ ట్విట్టర్‌లో పేర్కొన్న ఒక రోజు తర్వాత, అదే పార్టీకి చెందిన ఎంపీ అపరూప పొద్దార్ మరో ట్వీట్ చేశారు. 2024లో మమతా బెనర్జీ ప్రధాని అవుతారని.. అదే ఏడాది అభిషేక్ బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారని ఆ ట్వీట్ సారాంశం. "2024లో ఆర్‌ఎస్‌ఎస్ ఎంపిక చేసిన రాష్ట్రపతి ద్వారా మమతా బెనర్జీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.. అభిషేక్ బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారు" అని పొద్దార్ ట్వీట్ చేశారు. అయితే, ఆమె ట్వీట్ పోస్ట్ చేసిన గంట తర్వాత ఆ ట్వీట్‌ను తొలగించారు.
బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ మూడవసారి విజయం సాధించిన మొదటి వార్షికోత్సవం సందర్భంగా.. ఆ పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్.. 2036లో బెంగాల్ ముఖ్యమంత్రిగా అభిషేక్ బెనర్జీ బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ సైనికుడిగా, 2036 వరకు మమతా బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉంటారని నేను చెప్పగలను. 2036లో, అభిషేక్ బెనర్జీ (మమత మేనల్లుడు) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమంలో ఆమె సంరక్షకురాలిగా హాజరవుతారని ఘోష్ ట్వీట్ చేశారు. అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా జ్యోతిబసు రికార్డును బద్దలు కొట్టడం ద్వారా మమతా బెనర్జీ భారతదేశంలో కొత్త చరిత్రను సృష్టిస్తారని అని ఆయన అన్నారు.