పండగ బోనస్.. బంగారం ధరలు తగ్గాయ్

దీపావళిపండగకు బంగారం ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. కానీ పండగ సమయంలో పసిడి ధర తగ్గింది.

Update: 2022-10-22 02:22 GMT

దీపావళి పండగకు బంగారం ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. కానీ పండగ సమయంలో పసిడి ధర తగ్గింది. ధన్ తెరాస్ కారణంగా ధరలు పెరుగుతాయని అంచనా వేసినా స్వ్పలంగా తగ్గడం పసిడి ప్రియులకు ఊరట కల్గించే అంశం. బంగారం ధరలు తగ్గడానికి, పెరగడానికి అనేక కారణాలున్నాయి. కేంద్ర బ్యాంకుల వద్వ నిల్వలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. అయితే బంగారం ధరలు అతి త్వరలోనే పెరుగుతాయని మాత్రం విశ్లేషణలు వెలువడుతున్నాయి. పసిడి అంటే ఇష్టపడే వారు ఈ నెలలో ఎక్కువగా బంగారం కొనుగోలు చేసే అవకాశముందని కూడా చెబుతున్నారు.

నిలకడగా వెండి...
దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అదే సమయంలో వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,450 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,250 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర 61,150 రూపాయలు ఉంది.


Tags:    

Similar News